: ప్చ్ .. మళ్లీ అదే ఆటతీరు...నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా!


టీమిండియా మరోసారి పేలవ ప్రదర్శన చేస్తోంది. బాధ్యతాయుతంగా ఆడాల్సిన రెండో ఇన్నింగ్స్ లో బాధ్యతారాహిత్య ఆటతీరు ప్రదర్శిస్తూ వికెట్లు పారేసుకుంటోంది. తొలి టెస్టుతో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచిన భారత ఆటగాళ్లు రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా కుదురుకోలేదు.

తొలి ఇన్నింగ్స్ హీరో కేఎల్ రాహుల్ మరోసారి అర్ధ సెంచరీతో సత్తాచాటి ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కోవడం మరీ అంత కష్టం కాదని నిరూపించిన చోట, ఆసీస్ బౌలింగ్ కు టీమిండియా బ్యాట్స్ మన్ మరోసారి విఫలమయ్యారు. దీంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 45 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత జట్టులో రాహుల్ (51) రాణించగా, అభినవ్ ముకుంద్ (16), విరాట్ కోహ్లీ (15), రవీంద్ర జడేజా (2) ఘోరంగా విఫలమవడంతో నాలుగు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా (42), అజింక్యా రహానే (15) ఆడుతున్నారు. 

  • Loading...

More Telugu News