: తన 'సరోగసీ' పిల్లలకు నామకరణం చేసిన కరణ్ జోహార్!
అద్దెగర్భం విధానంలో తన వీర్యకణాలను దానం చేయడం ద్వారా, గుర్తు తెలియని మహిళ ద్వారా, తాను కన్న ఇద్దరు పిల్లలకు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ పేర్లు పెట్టాడు. తన కుమారుడికి యష్ అని, కుమార్తెకు రూహి అని పేరు పెట్టినట్టు ఆయన తెలిపాడు. తన జీవితంలోకి కొత్తగా ఇద్దరు వచ్చి చేరడం అత్యంత ఆనందానుభూతిని కలిగిస్తోందని, ఓ తండ్రిగా ఈ ఉద్విగ్నభరిత క్షణాలను తాను ఆస్వాదిస్తున్నానని, అందుబాటులోని అత్యాధునిక వైద్య విజ్ఞానం సాయంతో ఇద్దరు కొత్తగా జన్మించారని, ఇకపై వారితోనే తన లోకమని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, వారిని పెంచేందుకు మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా సిద్ధమయ్యానని, వారిపై తాను అవ్యాజమైన ప్రేమను, ఆప్యాయతను, శ్రద్ధను చూపనున్నానని తెలిపాడు. వారే ఇక తన ప్రపంచమని, తన తొలి ప్రాధాన్యతని చెప్పుకొచ్చాడు.