: ఆ వార్తలన్నీ పుకార్లే: కొట్టిపారేసిన దర్శకుడు రాజమౌళి


'బాహుబలి-2' సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా, అత్యంత జాగ్రత్తగా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో, ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని... ఇవన్నీ కేవలం రూమర్లే అంటూ రాజమౌళి స్పష్టం చేశాడు. "బాహుబలి-2కు చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారన్నది ఫాల్స్ న్యూస్" అంటూ ట్వీట్ చేశాడు.

ఈ సినిమా ట్రైలర్ ను మార్చి మధ్యలో విడుదల చేయడానికి రాజమౌళి సన్నాహకాలు చేస్తున్నాడు. ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News