: ఆయనకు సీటు ఇవ్వకుండా మంచి పని చేశారు!: కేసీఆర్ ను మెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు, కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలపై ఎలాంటి ప్రేమా లేని గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా మంచి పని చేశారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీని పొంది, మంత్రి కావాలని ఆయన ఎంతో ప్రయత్నించారని, ఆయన్ను దూరం పెట్టినందుకు తనకు సంతోషంగా ఉందని అన్నారు.

తమ్ముడికి మదర్ డెయిరీ బాధ్యతల కోసం మాత్రమే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆరోపించిన కోమటిరెడ్డి, ఆయన ఇంతవరకూ మూడు పార్టీలు మారారని, త్వరలో ఇంకే పార్టీకి పోతారో తెలియదని ఎద్దేవా చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలను ఆయన మానుకోవాలని అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలను దగ్గర చేయడంలో విఫలమైన కేసీఆర్, కనీసం ప్రజలకు తాగు, సాగు నీటిని కూడా అందించలేకపోతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News