: వైఎస్సార్సీపీకి శత్రువు జగనే!: భూమా నాగిరెడ్డి


వైఎస్సార్సీపీకి శత్రువు జగనే నని కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమా నాగిరెడ్డి విమర్శించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘జగన్ తీరు నచ్చకే నేను టీడీపీలో చేరాను. జగన్.. పెద్దల్ని గౌరవించరు.. మాట వినరు. సొంత నిర్ణయాలతో పార్టీకి నష్టం కలిగించారు. నేను వైఎస్సార్సీపీలో ఉండగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా జగన్ ఇవ్వలేదు. మంత్రి పదవి కోసం నేను పార్టీ మారలేదు. బెటర్ ఛాయిస్ గా నన్ను చంద్రబాబు ఎంచుకున్నారు. నాకు, నా కూతురిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. అయితే, అనుభవఙ్ఞులకే బాబు ప్రాధాన్యమిస్తారు. అఖిల ప్రియను మంత్రిని చేసినా నాకు అభ్యంతరం లేదు. నంద్యాల అభివృద్ధి కోసమే నేను పార్టీ మారాను, అందుకు ప్రజల ఆమోదం కూడా ఉంది. నాకు మంత్రి పదవి ఇవ్వవద్దని కర్నూలుకు చెందిన టీడీపీ నేతలు ఎందుకు చెప్పరో నాకు తెలియదు. కర్నూలు టీడీపీలో ఉన్న వాళ్లంతా మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్న వాళ్లు కాదు’ అని భూమా నాగిరెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News