: రోజా ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి : బోండా ఉమ
ఎమ్మెల్యే రోజా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే టీడీపీ ఎమ్మెల్యే అనిత కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడినా రోజా తీరులో మార్పులేదని, సీఎం చంద్రబాబు, తమ పార్టీ నేతలపై రోజా తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తోందని ఆయన విమర్శించారు. రోజాను చూసి అసెంబ్లీలో అటెండర్ కూడా భయపడరని అన్నారు.
జేసీ సోదరులు అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరముందని అన్నారు. వైఎస్ ఫ్యామిలీ గుట్టును త్వరలో బయటపెడతామని ఉమ పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ, మృతుల కుటుంబీకులకు జేసీ ట్రావెల్స్ నష్ట పరిహారం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.