: జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైఎస్సార్సీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
టీడీపీ నేత, దివాకర్ ట్రావెల్స్ అధిపతి జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో సిగ్గూశరం లేని ఏకైక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని, ఆయన నోటిని ఫినాయిల్ తో కడిగే సమయం వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బజారు మనిషిలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడుతున్న భాషపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
వైఎస్సార్సీపీకి చెందిన మరో నేత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిమాట్లాడుతూ, జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరకుక్క అని, నాడు పరిటాల రవికి భయపడి జేసీ బ్రదర్స్ పరారయ్యారని, జేసీ బ్రదర్స్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, దమ్ముంటే నేరుగా జగన్ ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.