: నచ్చిన వాళ్లతో అమ్మాయిలు వెళ్లిపోవడమే ఆ ప్రాంత వింత సంప్రదాయం!


మధ్యప్రదేశ్ లోని భిల్, భిలాలా తెగలు నివసించే ప్రాంతమది. హోలీకి వారం రోజుల ముందు వీళ్లు జరుపుకునే భగోరియా మేళా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా, సంప్రదాయ అలంకరణతో వచ్చే అమ్మాయిల్లో, తనకు నచ్చిన అమ్మాయిపై అబ్బాయి రంగు చల్లుతాడు. అతను తనక్కూడా నచ్చినట్లయితే, ఆ అమ్మాయి అతనితో వెళ్లిపోవచ్చు. ఆపై వారి తల్లిదండ్రులు, భిల్ సమాజం వారిని భార్యాభర్తలుగా అంగీకరిస్తుంది.

ఒకరకంగా సామూహిక స్వయంవరంగా పేరున్న ఈ ఉత్సవాల్లో, ముందుగా పరిచయం పెంచుకుని, పెద్దలకు చెప్పి, జంటగా మారేవాళ్లే ఎక్కువగా ఉంటారని తెలుస్తోంది. ఇక పరిచయం లేని అబ్బాయి, ఎవరిపైనైనా రంగు చల్లితే, అతన్ని అంగీకరించాలా? వద్దా? అన్నది అమ్మాయి ఇష్టం. అతను నచ్చకుంటే, ఆ రంగును తుడిచేసుకుని పక్కకెళ్లిపోవచ్చు. ఇలా ప్రేమ జంటలను కలిపే వింతైన సంప్రదాయం, మధ్యప్రదేశ్ లోని పశ్చిమ నిమార్‌, అలీరాజ్‌పూర్‌, ఝాబువా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ప్రతియేటా జరుగుతూ ఉంటుంది.

  • Loading...

More Telugu News