: ఎల్లుండి రోజాపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ అసెంబ్లీ!


మంగళవారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైకాపా శాసన సభ్యురాలు రోజాపై సభ ప్రారంభమయ్యే రోజే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ఆమెను అనుమతించే అవకాశం ఉందని శాసన సభ వర్గాలు వెల్లడించాయి. ఆ తరువాత మాత్రం ఆమెను సభలోకి అనుమతించాలా? వద్దా? అన్న విషయమై స్పష్టత రానుంది.

కాగా, ముఖ్యమంత్రిపై రోజా చేసిన వ్యాఖ్యలకు ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో, ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో రోజాపై మరో సంవత్సరం సస్పెన్షన్ కు హక్కుల కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాను అసెంబ్లీకి వచ్చి క్షమాపణలు చెబుతానని, తనను అనుమతించాలని స్పీకర్ కోడెలకు రోజా లేఖ రాశారు. ఆమె వచ్చి సభలో క్షమాపణలు చెబితే, సస్పెన్షన్ తొలగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News