: స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో దుమ్ము దులిపేసిన ఫ్లిప్‌కార్ట్!


ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌ ఫ్లిప్‌కార్ట్ మార్కెట్లో దూసుకుపోతోంది. మిగతా అన్ని కంపెనీల కంటే అత్య‌ధికంగా స్మార్ట్‌ఫోన్ల‌ను విక్ర‌యిస్తోంది. 2016 పండగ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో మెజారిటీ వాటా దక్కించుకుని, భార‌త మార్కెట్‌లో ఆ అమ్మ‌కాల్లో తనదే సింహ‌భాగ‌మ‌ని నిరూపించుకుంది. కాగా, అమెజాన్ కూడా లాభాల పంట పండించుకుంది. గ‌త ఏడాది అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో ఫ్లిప్‌కార్ట్‌ ఒక్కటే 51శాతం మార్కెట్‌ వాటా ద‌క్కించుకుంటే, అమెజాన్‌ 33 శాతం సొంతం చేసుకుంది. మ‌రోవైపు ఈ రంగానికే చెందిన స్నాప్‌డీల్ మాత్రం వెనుక‌బ‌డిపోయింది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ఆ సంస్థ వాటా 13 శాతానికి పడిపోయింది.



  • Loading...

More Telugu News