: రోజా తీరుతో మహిళల గౌరవానికి భంగం కలుగుతోంది: శోభ హైమావతి


వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారశైలిపై తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభ హైమావతి విమర్శలు గుప్పించారు. ఆమె తీరుతో మహిళల గౌరవానికే భంగం కలుగుతోందని విమర్శించారు. మహిళలకు తలవంపులు తెచ్చేలా రోజా ప్రవర్తిస్తున్నారని అన్నారు. హుందాగా వ్యవహరించడం రోజా నేర్చుకోవాలని సూచించారు. నిత్యం వార్తల్లో నిలిచేందుకు రోజా ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఆమెను అలాగే ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో రోజాతో పాటు కలసి కూర్చునేందుకు మహిళా సభ్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News