: ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన వారణాసి ప్రజలు.. హోరెత్తిన ‘మోదీ.. మోదీ’ నినాదాలు


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో రికార్డు స్థాయిలో ఓట్లు పొందిన‌ న‌రేంద్ర మోదీ.. అదే ప్రాంతంలో ఈ రోజు భార‌తీయ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఎన్నిక‌ల‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోదీకి అక్క‌డి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న‌పై పూలు చ‌ల్లుతూ మోదీ.. మోదీ నినాదాల‌తో హోరెత్తించారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు భారీగా పాల్గొన్నారు. అక్క‌డి కాశీ విశ్వ‌నాథ మందిరం వైపుగా ఆయ‌న వెళుతున్నారు. అక్క‌డి అస్సీ, మ‌ధ‌ని, సోనాపుర‌, గోదోవ్లియా, బ‌ష్ఫ‌త‌క్ ప్రాంతాల్లో ఆయ‌న ర్యాలీ కొన‌సాగుతోంది.


  • Loading...

More Telugu News