: ఎస్సై దంపతుల మరణాల కేసులో... సిద్ధిపేట పోలీస్ కమిషనర్ పై కేసు నమోదు!
సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై కేసు నమోదైంది. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల మరణాలకు వీరే కారణమంటూ వారి కుమారుడు ప్రేమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి ప్రజాసంఘాలతో కలసి దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట చిట్టిబాబు కుమారుడు ఆందోళన చేశాడు. ఈ నేపథ్యంలో, న్యాయం చేస్తామంటూ నిజామాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే, కమిషనర్, ఏసీపీలపై ఐపీసీ 302, సీఆర్పీసీ 174 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు, చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు దుబ్బాక బంద్ కు అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి.