: అప్పుడు, నేను గంగలో దూకుతా.. లేదంటే రాహుల్ దూకాలి!: ఉమా భారతి


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి మండిపడ్డారు. గంగా నది ప్రక్షాళన విషయమై ప్రధాని మోదీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఉమా భారతి ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, వాటి ఫలితాలు విడుదలైన తర్వాత రాహుల్ విదేశాలకు పారిపోవడం కాదని, నేరుగా తనతో గంగా నది వద్దకు రావాలని అన్నారు. అప్పుడు గంగా నది శుద్ధి కార్యక్రమం ప్రారంభం కాకుంటే... తాను గంగలో దూకుతానని, లేకుంటే రాహుల్ దూకాలని ఉమా భారతి అన్నారు. 

  • Loading...

More Telugu News