: పొమ్మనలేక పొగపెట్టినట్టు వ్యవహరిస్తున్నారు: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి తనను పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాపోయారు. టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో చర్చించిన క్రమశిక్షణ అంశంపై ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒత్తిళ్లను తట్టుకుని, సవాల్ గా తీసుకుని తాను ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యానని చెప్పారు. తమకు పట్టు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కష్టమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాలో కథనాలు రాయించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన సోదరుడు వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ ఇమేజ్ ను పెంచారని, టీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని కేడర్ ను కాపాడుకుంటున్నామని రాజగోపాల రెడ్డి అన్నారు.