: కీలక శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉన్నాయి... తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది: దిగ్విజయ్ సింగ్


తెలంగాణ ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. హైదరాబాదులో టీపీసీసీ సమన్వయ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పాటుపడ్డామని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ప్రాజెక్టుల పూర్తి, ప్రజలకు సాగు, తాగునీరు అందించడంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమష్టిగా టీఆర్ఎస్ ను ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం దేశ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పే లెక్కలను చూసి నిపుణులే ఆశ్చర్యపోతున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. 

  • Loading...

More Telugu News