: ఈ నెలాఖరు నుంచి నిలిచిపోనున్న‘ స్కైప్ వైఫై యాప్' సేవలు!
మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నెలాఖరు నుంచి స్కైప్ వైఫై యాప్ సేవలను నిలిపి వేస్తున్నట్లు సమాచారం. సదరు వినియోగదారుల వద్ద మిగిలిపోయిన స్కైప్ క్రెడిట్ ను కాల్స్, మెస్సేజ్ లు పంపేందుకు వినియోగించుకోవాలని లేదా స్కైప్ వినియోగదారుల సేవల విభాగాన్ని సంప్రదిస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల హాట్ స్పాట్లలో ఏదో ఒక దానికి అనుసంధానమయ్యే అవకాశం ఉండటం స్కైప్ ప్రత్యేకత.