: రాఘవేంద్రస్వామి సేవలో గాలి జనార్దనరెడ్డి
ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి మఠం అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన, మహామంగళ హారతి తదితర పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు స్వామి వారి శేష వస్త్రం ఇచ్చి జనార్దన రెడ్డిని ఆశీర్వదించారు.