: టీఎస్ ఆర్టీసీలో ఛాన్స్ ఇవ్వండి సారూ!: తొలి మహిళా బస్సు డ్రైవర్ విన్నపం
దేశంలోనే తొలి మహిళా బస్సు డ్రైవర్ గా పేరుతెచ్చుకున్న సరిత ఈ రోజు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్ టీసీ) డ్రైవర్ గా అవకాశమివ్వాలని మంత్రిని కోరారు. ఆమె చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. కాగా, నల్లగొండ జిల్లా సంస్థాన నారాయణ్ పూర్ వాసి అయిన సరిత ఆటో డ్రైవర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. రెండేళ్లుగా ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో ఆమె డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు, ఆజాద్ ఫౌండేషన్ తరపున ఢిల్లీలోనే క్యాబ్ డ్రైవర్ గా ఆమె పని చేశారు. మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ సహా పలు వాహనాలను ఆమె నడుపుతారు. గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఉమెన్స్ అచీవర్స్’ సహా పలు అవార్డులను సరిత అందుకున్నారు.