: భారీ వేతనాన్ని అందుకుంటున్న టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే


టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే కొన్ని నెలల క్రితం భారత క్రికెట్ టీమ్ చీఫ్ కోచ్‌గా నియ‌మితుడైన విష‌యం తెలిసిందే. అయితే, కుంబ్లేకి బీసీసీఐ నుంచి వ‌స్తోన్న పారితోషకం ఎంతో తెలుసా? ఏడాదికి 6.5 కోట్ల రూపాయలట‌. బోర్డుతో ఒప్పందంలో ‘ఏ’ కేటగిరిలోని ఆటగాళ్ల కన్నా ఆయ‌న జీతం ఎన్నో రెట్లు ఎక్కువ. మరోవైపు ఒప్పందాల్లోని ఆటగాళ్ల వేతనాల పెంపు ప్రతిపాదనపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అలాగే బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ల వేత‌నాన్ని కూడా పాతికశాతం వరకూ పెంచాలని ప‌లువురు ప్ర‌తిపాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News