: అజయ్ కల్లంను చంద్రబాబు అవమానించలేదా? ఆ విషయం కలెక్టర్లకు తెలియదా?: రోజా సూటిప్రశ్న


ఎన్నడూలేని విధంగా ఓ రాష్ట్ర విపక్ష నేతపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ అధికారులు తీర్మానం చేయడాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా తప్పుబట్టారు. ఐఏఎస్ అధికారులలో ముఖ్యులైన సీఎస్ అజయ్ కల్లం సీఎస్ గా ఉన్నప్పుడే, చంద్రబాబునాయుడు ఎందుకు మరో సీఎస్ గా దినేష్ గారిని నియమించి ఆయన్ను అవమానించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కల్లంకు జరిగిన అత్యంత ఘోర అవమానం ఐఏఎస్ ఆఫీసర్లకు కనిపించడం లేదా? అని అడుగుతున్నానని అన్నారు. వారి ఇష్టానికి చంద్రబాబునాయుడు అవినీతి చేసిన ఫైళ్లను పంపించి, వాటి మీద సంతకం పెట్టమంటే, అటువంటి తప్పుడు పని చేయలేక, వాటిని తిరిగి పంపించారన్న కసితో అజయ్ కల్లంను ఇంత ఘోరంగా చంద్రబాబు అవమానించారనని నిప్పులు చెరిగారు. ఆయన్ను శిక్షించేలా ఎందుకు తీర్మానం చేయలేదంటూ ఐఏఎస్ అధికారుల సంఘంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎమ్మెల్యే రామకృష్ణ, కలెక్టర్ శ్రీకాంత్ మధ్య జరిగిన ఉదంతాన్నీ ఆమె గుర్తు చేశారు. కలెక్టర్ చేతుల్లోని కాగితాలను లాక్కొని చించి, మైకులు విసిరేసిన ఘటనను ఐఏఎస్ అధికారుల సంఘం ఎలా మరచిపోయిందని అడిగారు. జడ్పీ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు కలెక్టర్ల ముందే తెలుగుదేశం నేతలు చేసిన దుర్మార్గాలకు దిగిన వేళ ఈ సంఘం ఏమైపోయిందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News