: జగన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన గంగుల, నాని!


ఏపీలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆళ్ల నాని పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను వారు కలిశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జగన్ ని కలిసి తమ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం, మీడియాతో గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షంపై బురద చల్లడమే పనిగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన తమ నాయకుడిపై ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఇటువంటి పని చేయడం ప్రభుత్వానికి తగునా? అని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. అధికారంలో ఉన్నవారు హుందాగా ముందుకు వెళ్లాలే తప్పా, ఈ విధంగా చేయడం ఎంత వరకు సబబు? అని, అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రత్యేక హోదా విషయమై విశాఖలో ఇటీవల తలపెడదామనుకున్న ర్యాలీ విషయంలో కూడా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయమని మండిపడ్డారు. ఏ పార్టీకి చెందిన వారు అధికారంలో ఉన్నా, అధికారులు మాత్రం చట్టబద్ధంగా, న్యాయంగా వ్యవహరించాలని గంగుల సూచించారు. 

  • Loading...

More Telugu News