: ఆసీస్ పై సచిన్ కు కూడా లేనంత అద్భుత రికార్డు కోహ్లీకి ఉంది!: సౌరవ్ గంగూలీ


భారత్-ఆస్ట్రేలియా మధ్య పుణె వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా రెండో టెస్టు మ్యాచ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా వేదికగా గతంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ గురించి గంగూలీ ప్రస్తావించాడు. ఆ సిరీస్ లో కోహ్లీ వరుసగా నాలుగు శతకాలు బాదాడని, ఆసీస్ పై కోహ్లీకి అద్భుత రికార్డు ఉందని, సచిన్ కు సైతం అలాంటి రికార్డు లేదని అన్నాడు.

  

  • Loading...

More Telugu News