: జగన్ పై కేసులకు వ్యతిరేకంగా రోజా, భూమనల ఆధ్వర్యంలో ధర్నా


నందిగామ ఘటన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పై క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి వ్యతిరేకంగా ఆ పార్టీ శ్రేణులు తిరుపతిలో ధర్నా నిర్వహించాయి. స్థానిక భవానీ నగర్ సర్కిల్ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. వీరంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జగన్ పై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ, వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. 

  • Loading...

More Telugu News