: రియల్ హీరో కోహ్లీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: వరుణ్ ధావన్
రియల్ హీరో విరాట్ కోహ్లీ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన వరుణ్ ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ‘బద్రినాథ్ కీ దుల్హానియా’ చిత్రంలో తన హెయిర్ స్టైల్ కు స్ఫూర్తి కోహ్లీయేనని, ప్రశాంతంగా, నిగర్వంగా ఉండే కోహ్లీ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని వరుణ్ పేర్కొన్నాడు. కాగా, గత నెల 14న ‘బద్రినాథ్ కీ దుల్హానియా’ చిత్రం విడుదలైంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన ఆలియా భట్ నటించింది.