: వైఎస్సార్సీపీలోకి దగ్గుబాటి పురంధేశ్వరి?
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి, మహిళా మోర్చా నేత పురంధేశ్వరి పార్టీ మారనున్నారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీలో ఆమె చేరుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీలో ఆమెకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం, ఏపీలో ఆ పార్టీకి తగినంత పట్టు లేకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలో చేరాలని పురంధేశ్వరి చూస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డితో పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలోకి ఆమెను తీసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి ఆమెను పోటీ చేయించాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పురంధేశ్వరి ఓటమి పాలైంది. సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ కూడా వైఎస్సార్సీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.