: పవన్ కల్యాణ్ కు 'బంగారు కత్తి'ని కానుకగా ఇచ్చిన శివబాలాజీ!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బంగారు పూత పూసిన ఓ కత్తిని చేతపట్టాడు. ఆ కత్తిని చూసి పవన్ మురిసిపోయాడు. ఇంతకీ, ఈ బంగారు కత్తిని పవన్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందంటే..  ‘కాటమరాయుడు’ చిత్రంలో పవన్ కు తమ్ముడి పాత్రలో నటుడు శివ బాలాజీ నటిస్తున్నాడు. పవన్ అంటే శివ బాలాజీకి ఎంతో అభిమానం. ఈ నేపథ్యంలో బంగారు పూత పూసిన ఓ కత్తిని పవన్ కు కానుకగా ఇవ్వాలని శివబాలాజీ అనుకున్నాడు.

దీంతో, డెహ్రాడూన్ లో ఈ కత్తిని తయారు చేయించాడు. తన భార్య మాధురితో కలిసి డిజైన్ చేసిన ఈ కత్తికి ఉండే పిడి కింద  జనసేన పార్టీ లోగో, కత్తికి రెండు వైపులా తెలుగు, హిందీ భాషల్లో ‘సంభవామి యుగే..యుగే..’ అని రాసి ఉన్నాయి. ‘మనసు గెలుచుకున్నావు’ అంటూ ఈ కత్తిని అందుకున్న పవన్   శివబాలాజీని అభినందించాడు. ఈ సందర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ, ‘పవన్ కు నేను అభిమానిని. కాటమరాయుడు చిత్రంలో నన్ను తీసుకోమని పవన్ సిఫార్సు చేశారట. అందుకే పవన్ కు ఏదైనా ఒక కానుక ఇవ్వాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. సమాజం కోసం పోరాడుతున్న ఆయన కోసం ఓ కత్తి ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది’ అని చెప్పాడు. కాగా, కాటమరాయుడు చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.  

  • Loading...

More Telugu News