: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. కలెక్టర్ ఎందుకు ఉలిక్కిపడ్డారు?: రోజా


తమ అధినేత జగన్ మాట్లాడిన ఓ క్లిప్పింగ్ ను పట్టుకుని, దివాకర్ బస్సు ప్రమాద ఘటనను తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టీడీపీ ఎంపీని కాపాడటం కోసం ప్రమాద బాధితులకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆమె విమర్శించారు. ప్రభుత్వాన్ని తమ అధినేత ప్రశ్నిస్తే... జిల్లా కలెక్టర్ ఎందుకు ఉలిక్కిపడ్డారని ప్రశ్నించారు. నందిగామ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో జగన్ పై కేసు నమోదు చేయడం ఆయనపై బురదజల్లడానికే అని మండిపడ్డారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులకు ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు. ఈ పరిహారం ప్రభుత్వం ఇస్తుందా? లేక తన ఎంపీతో ఇప్పిస్తుందా? అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 

  • Loading...

More Telugu News