: బాధితుల‌కు న్యాయం చేయాల్సిన ప‌రిస్థితుల్లోనే జ‌గ‌న్ క‌లెక్ట‌ర్‌తో వాద‌న‌కు దిగాల్సి వచ్చింది!: రోజా


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నందిగామ ప్రభుత్వాస్పత్రిలో నిన్న క‌లెక్ట‌రుతో ప్ర‌వర్తించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌ బాధితుల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌శ్నిస్తే, వారికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తే జ‌గ‌న్ పై కుట్ర‌లు ఎందుకు ప‌న్నుతున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఆసుపత్రిలో జ‌గ‌న్‌తో అధికారులు స‌రిగ్గా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఓ ఐఏఎస్ ఇలా ప్ర‌తిప‌క్ష నేత‌తో మాట్లాడిన దాఖ‌లాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించిన రోజా.. మీడియా సోద‌రుల‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని,  జ‌గ‌న్ మాట్లాడిన ఒక్క మాట క్లిప్పింగ్‌ను ప‌దేప‌దే వేసి టాపిక్‌ను డైవ‌ర్ట్ చేయాల‌ని చూడ‌వ‌ద్దని అన్నారు. బాధితుల‌కు న్యాయం చేయాల్సిన ప‌రిస్థితుల్లోనే జ‌గ‌న్ క‌లెక్ట‌ర్‌తో వాద‌న‌కు దిగాల్సి వ‌చ్చిందని అన్నారు.

జ‌గ‌న్ మాట్లాడిన ఆ ఒక్క‌మాట‌నే మీడియా చూపిస్తూ.. బ‌స్సు ప్ర‌మాదంలో మృతి చెందిన‌  ఆ ప‌ద‌కొండు మంది ఆత్మ‌ల‌కి శాంతిలేకుండా చేయొద్దని అన్నారు. 11మంది ప్రాణాలు తీసిని ఆ జేసీ యాజ‌మాన్యాన్ని టీడీపీ ప్ర‌భుత్వ నేత‌లు ఎందుకు ప్ర‌శ్నించ‌లేదని ఆమె అన్నారు. స‌రైన ద‌ర్యాప్తు ఎందుకు చేయ‌డం లేదని ప్ర‌శ్నించారు. అన్నింటికీ నోరు పారేసుకునే దేవినేని ఉమా ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని నిల‌దీశారు. మంత్రి కామినేని ఘ‌ట‌నా స్థలికి రాకుండా ప్రెస్‌ముందు రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోయారని రోజా విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News