: యంగ్ క్రికెటర్లకు దీటుగా వ్యాపార ఒప్పందాల్లో దూసుకుపోతున్న సౌరభ్ గంగూలీ
టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ వ్యాపార ఒప్పందాల్లో దూసుకెళుతున్నాడు. సచిన్ టెండూల్కర్, అశ్విన్, రైనా, రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్ ల కన్నా ఎంతో ముందున్నాడు. సౌరవ్ ఖాతాలో ఏకంగా 8 బ్రాండ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఏడాదికి ఆయనకు వస్తోన్న సొమ్ము రూ.1-1.5 కోట్లు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ ఏడాదికి రూ.8-12 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఎంఎస్ ధోనీ రూ.8-10 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో గంగూలీనే ఉండడం గమనార్హం. రిటైరయి ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ ఆయన బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గలేదు.
క్రికెట్, బుల్లితెర వ్యాఖ్యాతగానూ ఆయన ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. గంగూలీ టాటా టెట్లీ, డీటీడీసీ, ఎస్సిలర్ లెన్సెస్, సెంకో గోల్డ్, బర్న్‌పుర్ సిమెంట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారు. కాగా సచిన్ టెండుల్కర్ ఏడాదికి రూ.70-75 లక్షలు అందుకుంటున్నాడు.