: ముస్లింలు కాని వారి మాంసాన్ని ఎలా వండాలో జిహాదీలకు వివరించిన ఐసిస్!
ఉగ్రవాద సంస్థ ఐసిస్ పైశాచికత్వం ఏ రేంజ్ లో ఉందో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. సంకీర్ణ సేనల దాడులతో పలు ప్రాంతాలు ఐసిస్ నుంచి విముక్తి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో, విముక్తి పొందిన ప్రాంతాల్లో పలు దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిహాదీలకు శిక్షణ ఇచ్చిన కేంద్రాల్లో దొరికిన పత్రాల్లో ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయం వెల్లడయింది. ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడినప్పుడు ముస్లిమేతరులను, శత్రువులను చంపేసి, వారి మాంసం వండుకుని తినొచ్చని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ఒకవేళ ముస్లింలు అయినప్పటికీ, వారు రాడికల్ ఇస్లాంను విశ్వసించని వారైతే... వారి మాంసాన్ని కూడా తినొచ్చని అందులో ఉంది. అంతేకాదు, మనిషి శరీరంలోని ఏయే భాగాల నుంచి మాంసాన్ని తీయాలి? దాన్ని ఎలా వండాలి? అనే విషయాలను కూడా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. లండన్ కు చెందిన క్విలియం ఫౌండేషన్ ఈ మాన్యువల్ ను గుర్తించింది.