: దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో మృతుల వివరాలు


గత రాత్రి భువనేశ్వర్ నుంచి విశాఖ మీదుగా హైదరాబాద్ వస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు పెనుగంచిప్రోలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురికాగా, మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ఉండగా, మరణించిన వారిలో ఏడుగురి వివరాలను అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, తాడిపత్రికి చెందిన ఆదినారాయణరెడ్డి, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన తులసమ్మ, విజయవాడకు చెందిన షేక్ పాషా, సూర్యాపేట సమీపంలోని కోదండరామాపురానికి చెందిన సోదరులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన మధుసూదన్ రెడ్డి, కటక్ కు చెందిన సింగ్ ఉన్నారు. మిగిలిన వారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News