: ఏబీవీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయను: వెనక్కు తగ్గిన గుర్ మెహర్ కౌర్
బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీకి వ్యతిరేకంగా ప్రచారం తలపెట్టిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడి కుమార్తె గుర్ మెహర్ కౌర్ వెనక్కి తగ్గారు. ఈ నెల 22న రామ్ జాస్ కాలేజీలో జరిగిన వివాదం అనంతరం ఏబీవీపీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టిన ఆమె, ఇకపై తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, నేడు తలపెట్టిన ర్యాలీలో తాను పాల్గొనబోవడం లేదని తెలిపారు. ఈ ర్యాలీ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలీలో పాల్గొనాలని కోరారు.