: అశ్లీల సైట్లను ఆపలేం.. చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
అశ్లీల, లైంగిక హింస తదితర వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయకుండా ఆపలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వీడియోలు అప్ లోడ్ కాకుండా చేసే యంత్రాంగం తమ వద్ద లేదని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఎదుట తన నిస్సహాయతను ఒప్పుకుంది. అశ్లీల వీడియోలు ఇంటర్నెట్ లో అప్ లోడ్ కాకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు నిన్న విచారించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ యూయూ లలితలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... అలాంటి వీడియోలను అప్ లోడ్ చేయడాన్ని నియంత్రించలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.