: కోర్టుకు శ్రీనివాస్ హంతకుడు... మరణశిక్ష ఖాయమంటున్న నిపుణులు
కన్సాస్ లోని బారులో భారత యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చిచంపిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఘటన తరువాత ఆడమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతనిపై ఇప్పటికే వీడియో ఫుటేజ్ సహా, పక్కా సాక్ష్యాలు సేకరించారు. అతనే స్వయంగా కాల్పులకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉండటం విచారణ వేగంగా జరిగేందుకు ఉపకరిస్తుందని న్యాయ వర్గాలు వెల్లడించాయి. హత్య, హత్యాయత్నం కేసులను ఆడమ్ పై రిజిస్టర్ చేసిన పోలీసులు, సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో ఆడమ్ కు మరణదండన ఖాయమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.