: రూ.640 ఫీజు చెల్లించలేక చదువును మధ్యలోనే ఆపేశా.. గుర్తు చేసుకున్న తమిళ సినీ నటుడు!


మంచి మార్కులు వచ్చినా కేవలం రూ.640 లేక చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తమిళనాడులోని తిరువడనై ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు కరుణాస్ గుర్తు చేసుకున్నారు. రామేశ్వరం జిల్లాలోని తిరువడనై‌లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులకు సోమవారం ఆయన ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవాలన్న తనకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడగా నిలిచాయన్నారు. ఆర్థికంగా ఎన్నో కష్టాలు అనుభవించానన్న కరుణాస్ ప్లస్ టూలో మంచి మార్కులు వచ్చినప్పటికీ రూ.640  ఫీజు చెల్లించలేక చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందన్నారు. ఆ కారణంగానే తాను చెన్నై వచ్చానని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కరుణాస్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News