: యువకుల వేధింపులు భరించలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఇల్లెందు ఇందిరానగర్‌లో పురుగులమందు తాగి శిరీష అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ఆ యువతిని ఇద్దరు యువకులు వేధింపులకు గురిచేస్తున్నారని, వారి వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆ యువతిని వేధించిన వారిలో ఒక యువకుడిని తాము అదుపులోకి తీసుకున్నామని, కేసులో నిందితుడైన మరొక యువకుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.