: పైరసీ బారిన పడిన 'రంగూన్' సినిమా.. చిత్రం యూనిట్ లో ఆందోళన
బాలీవుడ్ నటులు సైప్ అలిఖాన్, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రంగూన్’ పైరసీ బారిన పడింది. ఈ నెల 24న ఈ సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మొత్తం ఇప్పుడు ఆన్లైన్లో దర్శనమిస్తోంది. ఈ విషయాన్ని గమనించి ఆ చిత్రం యూనిట్ ఆందోళనలో పడింది. ఆన్లైన్ లో ఆ సినిమా దర్శనమిస్తుండడంతో ఆ సినిమా వసూళ్లు తగ్గిపోతున్నట్లు సమాచారం. విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. ఇప్పుడు పైరసీ బారిన కూడా పడడంతో చిత్రం యూనిట్ ఆన్లైన్లో ఆ చిత్రం పైరసీ కాపీని ఉంచిన వారిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది.