: పర్వత ప్రాంతంపైకి ఎక్కి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తోన్న విరాట్ కోహ్లీ ఫొటో!


ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు భార‌త్ పర్య‌ట‌న‌లో భాగంగా పుణె వేదికగా జ‌రిగిన తొలి టెస్టులో టీమిండియా ప‌రాభ‌వం మూట‌గ‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల మంచి ఫాంలో ఉన్న కోహ్లీ సైతం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచులో మొద‌టి ఇన్నింగ్స్‌లో 0, రెండో ఇన్నింగ్స్ లో 13 ప‌రుగుల‌కే వెనుదిరిగి అభిమానుల‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో భారత్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు పర్వత ప్రాంతాలను వీక్షిస్తూ ఒత్తిడి తగ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. ఈ రోజు కోహ్లీ తాను ఓ ప‌ర్వ‌త ప్రాంతంపై ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్నాడు. ఈ సంద‌ర్భంగా తీసిన త‌న  ఫొటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రతిరోజు అవకాశాల్ని ఒడిసి పట్టుకుంటూ.. ముందుకు సాగిపోవాలని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో బెంగ‌ళూరులో రెండో టెస్టు మ్యాచ్ వ‌చ్చేనెల‌ 4 నుంచి జ‌ర‌గ‌నుంది.


  • Loading...

More Telugu News