: ఆస్కార్ ఉత్తమ చిత్రాన్ని తప్పుగా ప్రకటించిన వైనం!


లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ రోజు 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం అద‌ర‌హో అనేలా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, కార్య‌క్ర‌మం చివ‌ర్లో ఉత్త‌మ చిత్రాన్ని ప్ర‌క‌టించే క్ర‌మంలో వేదిక‌పై విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ అవార్డుల్లో 'లా లా ల్యాండ్' అవార్డుల పంట పండించుకుంది. అయితే, ఉత్త‌మ చిత్రంగా మాత్రం మూన్‌లైట్ నిలిచింది. అయితే, అంత‌కు ముందు ఉత్త‌మ చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డానికి వేదిక‌పైకి వ‌చ్చిన ఫాయే డునావే, వారెన్ బీటీ ఉత్తమ చిత్రం ‘లా లా ల్యాండ్’ అని ప్రకటించారు. దీంతో అక్క‌డున్న వారంతా హ‌ర్ష‌ధ్వానాలు వ్య‌క్తం చేశారు.

ఆ అవార్డు త‌మ‌కే వ‌చ్చింద‌నుకొని ‘లా లా ల్యాండ్’ టీం కూడా వేదికపైకి వ‌చ్చేసి ప‌ట్ట‌లేని ఆనందం వ్య‌క్తం చేసింది. అంత‌లోనే వారికి పిడుగులాంటి వార్త అందింది. ఉత్తమ చిత్రాన్ని తప్పుగా చదివినట్లు గ్రహించిన నిర్వాహకులు వెంటనే ‘లా లా ల్యాండ్’ కాదు ‘మూన్‌లైట్’ అని ప్రకటించారు. ఫాయే, వారెన్‌కు ఇచ్చిన కవర్‌లో ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్) పేరు ఉన్న పేపర్ ఉంది. దీంతో పొర‌పాటున సీనియర్ నటి ఫాయే డునావే ఉత్తమ చిత్రంగా ‘లా లా ల్యాండ్’ అంటూ ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ త‌ప్పుని స‌వ‌రించుకొని మూన్‌లైట్ సినిమాకి అవార్డు ఇచ్చారు.


  • Loading...

More Telugu News