: నరేంద్ర మోదీ ధరించిన స్కార్ఫ్ పై ముచ్చటపడ్డ యువతి... వెంటనే ఇచ్చేసిన మోదీ!


మహాశివరాత్రి పండగ నాడు కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఓ నీలిరంగు స్కార్ఫ్ ను మెడలో ధరించిన సంగతి గుర్తుందా? ఆ స్కార్ఫ్ పై ముచ్చటపడ్డ ఓ యువతి, దాన్ని కావాలని కోరగా, మోదీ వెంటనే ఆ స్కార్ఫ్ ను పార్శిల్ చేసి ఆమెకు పంపారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ లో చురుకుగా ఉండే శిల్పి తివారీ అనే యువతి, తనకు ఆ స్కార్ఫ్ కావాలని కోరుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్యాగ్ చేస్తూ ఒకే ఒక్క లైనుతో కూడిన ట్వీట్ చేసింది. దాన్ని చూసిన మోదీ, సదరు ట్వీట్ ప్రింట్ తీసి, దానిపై ఆటోగ్రాఫ్ చేసి, ఆ స్కార్ఫ్ తో సహా దాన్ని పార్శిల్ లో శిల్పికి పంపారు. దీన్ని అందుకున్న ఆమె ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. 

  • Loading...

More Telugu News