: పాక్‌లో ఉగ్ర వేట... పోలీసులు, రేంజర్స్‌ దళాల అదుపులో 600 మంది అనుమానితులు


అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచం నుంచి వస్తోన్న ఒత్తిడితో పాకిస్థాన్ ప్ర‌భుత్వం త‌మ దేశంలోని ఉగ్ర‌వాదుల‌పై దృష్టిపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాక్‌లోని పంజాబ్‌ పోలీసులు, రేంజర్స్‌ దళాలు ల్యాహ్‌, రావల్పిండి ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేసి సుమారు 600 మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయి. సుమారు 200 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాక్‌ రేంజ‌ర్స్ జ‌రుపుతున్న దాడుల‌తో ప‌లువురు అనుమానిత ఉగ్ర‌వాదులు రెచ్చిపోవ‌డంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పాక్ రేంజ‌ర్లు అదుపులోకి తీసుకున్న వారిలో ప‌లువురు ఆఫ్గన్‌ జాతీయులు కూడా ఉన్నారు. ఇటీవ‌ల పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు బాంబు దాడుల‌తో వంద‌లాది మంది ప్ర‌జ‌ల ప్రాణాలు తీసిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News