: కాన్సస్ కాల్పులపై స్పందించిన ప్రముఖ రచయిత జేకే రౌలింగ్
కాన్సస్ లో జరిగిన కాల్పులు, జాతి వివక్షకు బలైన ఇండియన్ యువకుడి ఘటనలో ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ ట్రంప్ కు చురకలు అంటించారు. కే శ్రీనివాస్ పై దాడిని భారత రైటర్ ఆనంద్ గిరిధర్ దాస్ ట్విట్టర్ లో స్పందించగా, వాటిని ఉటంకిస్తూ, రౌలింగ్ రీట్వీట్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగం సరదాగా ఉండదని, మనం వాడే భాష ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. అంతకుముందు గిరిధర్ దాస్ తన ట్విట్టర్ లో, ఈ కాల్పులకు, ట్రంప్ విధానాలకు సంబంధం లేదని చెప్పడంలో వైట్ హౌస్ అత్యుత్సాహం ప్రదర్శించిందని విమర్శించారు.