: తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం


ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదను నేలమాళిగల్లో దాచుకున్న దేవుడిగా చరిత్ర సృష్టించిన తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆలయ గోదాము, సమీపంలోని తపాలా కార్యాలయం పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. మంటల ధాటికి ఇద్దరికి గాయాలు అయినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు శ్రమిస్తున్నారు. విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News