: హైదరాబాద్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మందుపాప!


మద్యం తాగి వాహనాలను నడపవద్దని పోలీసులు ఎంత జోరుగా ప్రచారం సాగిస్తున్నా, ఇప్పటికీ ఎంతో మంది మారలేదని తెలుస్తోంది. శనివారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, పలువురు మందుబాబులతో పాటు ఓ మందుపాప కూడా పట్టుబడింది. మద్యం సేవించి కారును నడుపుకుంటూ వచ్చిన ఓ యువతి, పోలీసుల పరీక్షలకు సహకరించక కాసేపు హల్ చల్ చేసింది.

చుట్టూ మీడియా ఉందని, వారు ఫుటేజ్ సేకరిస్తున్నారని తెలుసుకోకుండా వాదనకు దిగింది. పోలీసులను ముప్పుతిప్పులు పెట్టింది. ఆమెను నిలువరించేందుకు మహిళా పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కారు దిగి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్న ఆమె, నియమిత మోతాదు కన్నా ఎక్కువ తాగివున్నట్టు తేలడంతో, కారును స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు పెట్టారు. నిన్నటి తనిఖీల్లో మొత్తం 12 మంది తాగి దొరికిపోయారని, ఏడు కార్లు, ఐదు బైకులను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News