: ముంబై ఎయిర్ పోర్టులో రూ.1.77 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం


ముంబై విమానాశ్రయంలో సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ప్ర‌యాణికుల‌ సోదాలు నిర్వ‌హిస్తోన్న సిబ్బంది ఈ రోజు పెద్ద మొత్తంలో బంగారం, విదేశీ క‌రెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కస్టమ్స్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ... ఓ ప్ర‌యాణికుడి నుంచి ఐదు కేజీల బంగారం, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.77 కోట్లుగా ఉంటుంద‌ని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆ బంగారం, న‌గ‌దుపై విచార‌ణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News