: టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య రాజుకున్న చిచ్చు!
మంచి స్నేహితులుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చిచ్చు రేపింది. బోర్డు ఛైర్మన్, సభ్యుల ఎన్నికల వ్యవహారం నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రాజుకున్నాయి. వక్ఫ్ బోర్డులో తాము సూచించిన ఇద్దరు వ్యక్తులను సభ్యులుగా నియమించాలని ఎంఐఎం సూచించింది. కానీ, అధికార టీఆర్ఎస్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. బోర్డు ఛైర్మన్ అభ్యర్థి విషయంలో కూడా ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎన్నికల సమావేశానికి ఎంఐఎం డుమ్మా కొట్టింది. అంతేకాదు, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఏర్పాటు చేసిన విందుకు కూడా ఎంఐఎం నేతలు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, ఇరు పార్టీల మధ్య ఉన్న మిత్రత్వానికి విఘాతం వాటిల్లవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.