: ట్రంప్ నెల రోజుల పాలనపై సర్వే.. భయాందోళనలు వ్యక్తం చేసిన మెజార్టీ అమెరికన్లు!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మెజారిటీ అమెరికన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 53 శాతం మంది అమెరికన్లు ట్రంప్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని భావిస్తున్నారు. 'ట్రంప్ నెల రోజుల పాలన ఎలా ఉంది?' అనే అంశంపై ఎన్ బీసీ న్యూస్, సర్వే మంకీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ట్రంప్ పాలన పట్ల కేవలం అసంతృప్తితోనే కాదు, తీవ్ర భయాందోళనల్లో కూడా ఆ దేశ మెజారిటీ పౌరులు ఉన్నారు. రానున్న నాలుగేళ్ల కాలంలో అమెరికా ఓ పెద్ద యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుందని వారు భయపడుతున్నారు. ఇది అమెరికా భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదని వారు భావిస్తున్నారు. ట్రంప్ పాలనపై 30 శాతం మంది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏడు ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మాత్రం 50 శాతం మంది మద్దతు తెలపడం విశేషం.

  • Loading...

More Telugu News