: సిద్ధరామయ్య రాజీనామాకు డిమాండ్ చేస్తున్న బీజేపీ యువమోర్చా!


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వివాదాలు వీడడం లేదు. ఏదో ఒక వివాదంతో ఆయన వార్తలలో వ్యక్తిగా మారుతున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని మంత్రి డైరీలో రాసుకున్న రహస్య సమాచారం (కాంగ్రెస్‌ అధిష్ఠానానికి మామూళ్లు పంపించిన సమాచారం) బహిర్గతమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ యువమోర్చా నేతలు డిమాండ్ చేశారు. బెంగళూరులోని మైసూరు బ్యాంకు కూడలిలో ఈ మేరకు బీజేపీ యువమోర్చా ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖరూపాలను పోలిన మాస్క్‌ లు ధరించి రోడ్ షో చేశారు. సిద్ధరామయ్యకు ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని వారు స్పష్టం చేశారు. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News