: సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకు చంద్రబాబు విందు!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక విందు ఇచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఈ విందు కార్యక్రమం జరిగింది. విజయవాడలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి న్యాయమూర్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. మరో విషయం ఏమిటంటే, విందు ఏర్పాట్లను ఆయన స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు.

జడ్జిలకంటే ముందుగానే పున్నమి ఘాట్ కు చేరుకున్న చంద్రబాబు విందు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆహార పదార్థాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నారు. విందుకు హాజరైన న్యాయమూర్తులకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. వారందరినీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచే సాధారణ సందర్శకులను ఘాట్ పరిసరాలకు అనుమతించలేదు. విందు ఫొటోలు బయటకు రాకుండా, విందు సిబ్బంది వద్ద సెల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News